
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోహెడ మండలం సందర్శన
కోహెడ యువతరం విలేఖరి;
కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ని కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ,జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు లు శనివారం బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో హరితహారం కార్యక్రమం గురించి మాట్లాడి కోహెడ మండలంలోని వివిధ గ్రామాల కార్యదర్శులతో గ్రామాలలో హరితహారం చెట్లను ఉపాధి హామీ కూలీలతో నాటించాలని ఆదేశించారు. మండలంలోని వివిధ ప్రాథమిక ఉన్నంత పాఠశాలల సందర్శన సందర్భంగా మన ఊరు, మనబడి కార్యక్రమంలో పూర్తయినటువంటి టాయిలెట్ల వసతుల గురించి సందర్శించి కోహెడ మండలంలోని గుంజపల్లి, ఎర్రగుంటపల్లి, ధర్మసాగర్ పల్లి గ్రామలోని నర్సరీ పల్లె ప్రకృతి వనం స్థానిక పాఠశాలల క్రిమిటోరియాలను సందర్శించారు. పాఠశాల నిర్వహణ మొక్కల పెంపకం పారిశుద్ధ్యం తదితర విషయాలలో గ్రామ పంచాయతీల పనితీరు పట్ల అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో… జడ్పీ సీఈవో రమేష్, డీపీవో దేవకి, డీఎల్పీవో, డీఈ సదాశివ, ఎంపీడీవో మధుసూదన్ , ఎంపీవో సురేష్, ఏఈ మాజిద్, అన్ని శాఖల అధికారులు బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు జాగిరి కుమారస్వామి తదితరులుపాల్గొన్నారు.