
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల పిఎఫ్ పాస్ పుస్తకాలు అందజేయాలి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ కి వినతి పత్రం అందజేత
భద్రాద్రి యువతరం ప్రతినిధి;
మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 2021-22,2022-23 వార్షిక వివరాలతో కూడిన సీఎం పిఎఫ్ పాస్ బుక్ లు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మణుగూరు ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి ఎస్ రమేష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడి దొడ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మణుగూర ఏరియా వివిధ గనులు డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 2020 -21 వార్షిక సివిల్, ఎస్ఎంఎస్ బ్లాస్టింగ్,పర్చేజ్, పార్కులు, గెస్ట్ హౌస్ లు, స్టోర్స్ , మణుగూరు ఓసి మ్యాక్స్ సొసైటీ ఇలా ఇంకా కొంతమంది కాంటాక్ట్ కార్మికులకు సీఎంపిఎఫ్ పాస్ బుక్కుల వివరాలు అందజేయాల్సి ఉందన్నారు.అదేవిధంగా 2021- 22,2022-23 రెండు సంవత్సరాల జమ వివరాలతో కూడిన పిఎఫ్ పాసుబుక్కులు కూడా త్వరగతిన పూర్తి చేసి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు .అలాగే ఈ క్రింది సమస్య కూడా పరిష్కరించాలని కోరుతున్నామన్నారు, అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు 2023 మార్చి 31 వరకు వార్షిక సీఎం పీఎఫ్ లెక్కల చిట్టీలు అందజేయాలి, చనిపోయిన లేదా అనారోగ్యంతో పని మానివేసిన కాంటాక్ట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ వాపస్ సొమ్ము త్వరగా అందజేయాలి . ఇటీవల కొత్తగా పనులలో చేరిన కాంటాక్ట్ కార్మికులందరికీ పిఎఫ్ నెంబర్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎం సాంబశివరావు, జి శ్రీనివాస్,ఎం రవికుమార్, ముత్యాలరావు, ఐ గోపి, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.