ఖాతాదారులు శ్రేయస్సు గ్రామీణ బ్యాంకు లక్ష్యం

ఖాతాదారులు శ్రేయస్సు
గ్రామీణ బ్యాంకు లక్ష్యం
అమడగూరు యువతరం విలేఖరి;
ఆమడగూరు మండల కేంద్రంలోఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవీంద్రారెడ్డి
ఖాతాదారులు, రైతులు శ్రేయస్సే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లక్ష్యమని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవీంంద్రా రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ను ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ బ్యాంకులోని రైతుల రుణాలు. ఈ ఏడాది రైతుల పంట రుణాల రిన్యూవల్ పై బ్యాంకు సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ జే యం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులు, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సేవలు చేస్తుందన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా అన్ని రకాల పంట రుణాలపై తక్కువ వడ్డీతో రుణాల పొందవచ్చు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఖాదర్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.