రేషన్ డీలర్ల మహాసభకు తరలిరండి

డీలర్లు మహాసభకు తరలిరండి
జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి,కొండారెడ్డి లు పిలుపు
అమడగు రు యువతరం విలేఖరి;
రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న చలో విజయవాడ కార్యక్రమానికి మండలంలోని డీలర్లు అందరూ సకాలంలో హాజరు కావాలని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, మండల డీలర్ల సంఘం అధ్యక్షులు ఎర్రమండ్ల కొండారెడ్డిలు పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకటరావు ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్రంలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలైన డీలర్లుకు 20000 నుంచి 25 వేల వరకు వేతనాలు మంజూరు చేయాలని, బీమా సౌకర్యం తో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. కరోనాలో మృతి చెందిన డీలర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు వీటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్లు వారు తెలిపారు. గత కొన్నేళ్లుగా నిరుపేదల నిరుపేదల కోసం నిత్యవసర సరుకులు అందించడంలో డీలర్లు పాత్ర వెలకట్ట లేని దని వారు తెలిపారు. కరోనా సంక్షోభంలో డీలర్లు ఎంతో ధైర్యంగా తమ ప్రాణాలను పక్కనపెట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించి ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న డీలర్ సమస్యలను ప్రభుత్వం గుర్తించి డీలర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు మంజునాథ్ రెడ్డి, ట్రెజరర్ చిదానంద రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఆదినారాయణ, బొగ్గులు సుధాకర్, ఉత్తప్ప, రఘునాథ్ రెడ్డి, మీసాల నాగరాజు, అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.