
పినపాక గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
భద్రాద్రి యువతరం ప్రతినిధి;
- కరకగూడెం మండల కేంద్రంలో టిపిసిసి సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ కాన్వాయ్ తో వచ్చి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసపూరిత హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై గొంతేత్తుతున్న కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని చూసి భయపడుతుందని అన్నారు.లిక్కర్ స్కామ్, లీక్ ల స్కాంతో రాష్ట్ర ప్రతిష్టను భ్రష్టు పట్టించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిదే అని ఎద్దేవ చేశారు..
వచ్చే ఎన్నికలలో పినపాక నియోజకవర్గ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు..
అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ,పినపాక మాజీ శాసనసభ్యులు,పాయం వెంకటేశ్వర్లు , పినపాక నియోజకవర్గ ఎల్ డి ఎం ఇంచార్జ్ మోత్కూరి ధర్మారావు , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహిముద్ ఖాన్ , టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి ,పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బిరం సుధాకర్ రెడ్డి , నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు కోర్సఆనంద్ , మీ బ్లాక్ మహిళా బర్ల నాగమణి , నియోజకవర్గ నాయకులు బట్ట విజయ్ గాంధీ , పోలేబోయిన శ్రీవాణి , కనితి కృష్ణ , పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం , సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.