ANDHRA PRADESHOFFICIAL
జగనన్న ఇల్లు వేగవంతం చేయాలి

జగనన్న ఇల్లు వేగవంతం చేయాలి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండలంలో జగనన్న ఇల్లు వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు నచ్చజెప్పి ఇళ్లను మొదలు పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. లబ్ధిదారులు ముందుకు రాకపోతే నోటీసులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. లబ్ధిదారులను ఒప్పించడమా లేక నోటీసులు ఇవ్వడమా ఏదో ఒకటి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవమని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ అరవింద్, ఎంఈఓ 2 రమేష్ తదితరులు పాల్గొన్నారు.