ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీపీఎం జీపు జాత

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే సిపిఎం జీపు జాత
తుగ్గలి యువతరం విలేఖరి;
మండలంలోని వివిధ గ్రామాలలో ప్రధానమైన సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీపు జాత కార్యక్రమం జరిగింది. మారెళ్ళ గ్రామం నుండి ప్రారంభమైన జీపు జాత రాత్రి ఎర్రగుడి గ్రామానికి చేరుకొయ్యింది. ఈ సందర్భంగా రాంపల్లి గ్రామంలో జరిగిన జీపు జాతాలో సిపిఎం నాయకులు కొండారెడ్డి, శ్రీరాములు, రంగరాజు, రంగస్వామి లు మాట్లాడుతూ మండలంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని, రాంపల్లి చెరువులో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేందుకు చెరువు సామర్థ్యాన్ని పెంచాలని, అలాగే చెరువులు అన్నింటికీ హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా త్వరగా నీళ్లు మళ్ళించాలని, అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని తెలిపారు ఈ సమస్యలు పరిష్కరించేందుకే జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.