
పండ్లు తోటల సాగుతో రైతుల అభివృద్ధి ఏపీడి పద్మావతి
తుగ్గలి యువతరం విలేఖరి ;
వ్యవసాయ బోరుబావులు ఉన్న రైతులు తమ పొలాల్లో పండ్ల తోటలు సాగు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఏపీడి పద్మావతి అన్నారు.బుధవారం తుగ్గలి లో రైతులు సాగుచేసిన పండ్లు తోటలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పండ్ల తోటలో సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 100 శాతం రాయితీ ఇస్తుందని ఆమె తెలిపారు అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆమె రైతులని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామకృష్ణ, జూనియర్ ఇంజనీర్ ప్రదీప్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.