ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన డిసిహెచ్ఎస్

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిసీహెచ్ఎస్..
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిసిహెచ్ఎస్ శ్రీనివాస రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు నిరీక్షించు గది, రక్త పరీక్ష కేంద్రం,మందు నిల్వ, సీసీ ఫుటేజ్ టీవీ గదులను, రికార్డులను పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామని, ఆసుపత్రిలో ఏ చిన్న సమస్య ఉన్న పరిష్కరిస్తామన్నారు. ఎమ్మిగనూరు ఆసుపత్రి సేవలు అందించడంలో రాష్ట్రంలో రెండు, మూడో స్థానాలు కూడా నిలిచిందని గుర్తు చేశారు. వైద్యసిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యానికి వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలని సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సూపర్డెంట్ డాక్టర్ మైత్రి, వైద్యులు మల్లికార్జున, చిరంజీవి, ఫాతిమా సిబ్బంది పాల్గొన్నారు.