నూతన తహసిల్దార్ కు ఆక్రమణల స్వాగతం

నూతన తహాసిల్దార్ కు ఆక్రమణల స్వాగతం
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి మండల తహసిల్దార్ గా శివరాముడు బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నూతన తహసిల్దార్ కు మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఆక్రమణలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండు నెలలుగా తహసిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో రామళ్లకోట రోడ్డు వైపు వంకలు, వాగులు ఆక్రమణలకు గురవుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనర్హం. అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ధైర్యంతో ఆక్రమణదారులు మరింత ముందుకు వెళ్లి నిర్మాణాలు మొదలుపెట్టారు. వంకలు వాగులు, ఆక్రమణకు గురి కావడం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలు పడితే వచ్చే వర్షపు నీరు ముందుకు వెళ్లలేక గ్రామంలోనికి వచ్చే అవకాశం ఉందని వెల్దుర్తి పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో తహసిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలు జరుగుతున్న పట్టించుకోకపోవడంతో ఇక పల్లెల్లో జరిగే ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏమి పట్టించుకుంటారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వంకలు, వాగులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్న మండల కేంద్రంలో ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన తహసిల్దార్ ఈ ఆక్రమణల పట్ల చర్యలు ఏమి తీసుకుంటారో వేచి చూడాలి.