ANDHRA PRADESHHEALTH NEWS
సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగాఉండాలి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
సీజనన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోకవరం ప్రాథమిక వైద్యశాల డాక్టర్ విజయేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలం ఎదురుపాడు మజర గ్రామమైన జడ్డువారిపల్లి గ్రామంలో 104 వైద్య సేవలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ టైఫాయిడ్ వ్యాధులు దోమల వలన ఈ వ్యాధులు వ్యాపిస్తాయని, అలాగే మలేరియా కలుషిత ఆహారం, కలుషిత నీరు వలన మలేరియా సంభవించే అవకాశం ఉందని ఆయన సూచించారు. కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుంకమ్మ , ఎం.ఎల్.హెచ్.పి దేవిక , ఆశ వర్కర్లు సుజాత పాల్గొన్నారు .