సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే జగనన్న సురక్ష

సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే జగనన్న సురక్ష
డోన్ యువతరం ప్రతినిధి;
డోన్ మండలం ఎర్రగుంట్ల వెంకట్ నాయుని పల్లె సచివాలయం నందు జగనన్న సురక్ష ఆర్థికశాఖ బుగ్గన.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.
జగనన్న సురక్ష కార్యక్రమంలో డోన్ మండల ఎంపీపీ రేగటి. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు డోన్, మాజీ మార్కేట్ యాడ్ చైర్మన్ రామచంద్రుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డోన్ రేగటి రాజశేఖర రెడ్డి మరియు రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ
రాష్ట్రంలో గతంలో మును పెన్నడూ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని మరియు మన డోన్ నియోజవర్గంలో ఆర్థిక శాఖ బుగ్గన. రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు రూ.2400 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్య క్రమాలు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా ఎర్రగుంట్ల గ్రామానికి 4,కోట్ల 36 లక్షలు వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం జరిగిందన్నారు
జగనన్న ప్రభుత్వము వచ్చినా తర్వాత కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పతకాలు అమలు చేయడం జరుగతుందన్నారు. సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా పతకాలు నేరుగా ఇంటీ దగ్గర కే రావడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరూ కూడా 2024 లో మన ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది
అర్హులై న ఏ ఒక్కరూ వివిధ కారణాల చేత ఆయా పథకాల యందు లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోనే వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి వారికి అవసరమైనటువంటి సేవాలు అందించుటకు‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో
ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుందని, తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజ¬న్, హౌస్ హోల్డ్ డివిజన్, ఇన్‌కమ్ మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుందని తెలిపారు.
ప్రతి ఇంటిని సందర్శించి నేరుగా సమస్యలను స్వీకరించి.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది,
నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుందని, అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలు సేకరిస్తారని, వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను వారు దగ్గరుండి పూర్తిచేస్తారని అన్నారు.