జగనన్న సురక్షతో అర్హులందరికీ న్యాయం

జగనన్న సురక్షతతో అర్హులందరికీ న్యాయం
కొత్తపల్లి యువతరం విలేఖరి:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం తో అర్హులందరికీ న్యాయం చేకూరుతుందని గ్రామ సర్పంచ్ నక్క విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద గుమ్మడాపురం గ్రామంలో ఎంపీడీవో మేరీ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. సచివాల ద్వారా గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎటువంటి సేవలు అవసరం గుర్తించి వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో 332 మందికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, మండల కన్వీనర్ కే. సుధాకర్ రెడ్డి, . మండల కో ఆప్షన్స్ సభ్యుడు గౌస్ వైసిపి నాయకులు నారాయణ రెడ్డి,ఎదురుపాడు రహంతుల్లా సూగురి రాము సచివాల సిబ్బంది మరియు వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.