
జగనన్న సురక్ష – ప్రతి కుటుంబానికి రక్ష
బాపట్ల యువతరం ప్రతినిధి;
జగనన్న సురక్ష పథకం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలకు ముఖ్యమైన 11 రకాల సర్టిఫికెట్లు జగనన్న సురక్ష ద్వారా నేరుగా ప్రజల చెంతకే అని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బుధవారం
బాపట్ల టౌన్ లోని ప్యాడిసన్ పేట మరియు నరాల శెట్టి వారి పాలెం సచివాలయాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్షకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అయిన జగనన్న సురక్ష ప్రజలకు సహాయం చేయడానికి ప్రతి గడపకు చేరుకోవడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది అన్నారు. ప్రజలకు అవసరమైన పథకాలు లేదా సర్టిఫికేట్‌లకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా పథకాలకు అవసరమైన సర్టిఫికెట్లు మరియు ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లు వెంటనే నేడు జరుగుతున్న సచివాలయాల శిబిరాల్లో అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. జగనన్న ప్రభుత్వంలో గడిచిన మూడేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్యాడిసన్ పేట సచివాలయంలోని 1808 కుటుంబాలకు 6 కోట్ల 36 లక్షలు మరియు నరాలశెట్టి వారిపాలెం సచివాలయంలోని 1528 కుటుంబాలకు 7 కోట్ల 68 లక్షలు పైగా లబ్ధి చేకూడింది అని
వెల్లడించారు. కరోనా లాంటి కష్ట కాలంలో కూడా జగన్ ఇచ్చిన మాట తప్పకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్బిదారి ఖాతాల్లో జమ చేసిన సంగతి గుర్తు చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తానన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ కూడా ఓట్ల కోసం ఎలక్షన్లకు ఆరు నెలల ముందు పసుపు కుంకుమ అనే పేరుతో 10000 రూపాయలు అది ఒకసారి కాకుండా మూడు విడతలుగా జమ చేసిన సంగతి గుర్తు చేశారు. ఈ జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం నుంచి మాట ఇచ్చిన ప్రకారం నేటికి వరుసగా నాలుగు సార్లు నేరుగా అక్కా చెల్లెమ్మల ఎకౌంట్లో జమ చేశారని అన్నారు.ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన నిలబడే ప్రభుత్వమని. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండటంవల్ల పేదవాడికి ఎంతో మేలు జరుగుతుందని కనక ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.