ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS
రాయలసీమ సమస్యల పరిష్కారానికి చలో ఢిల్లీ

రాయలసీమ సమస్యల పరిష్కారానికై చలో ఢిల్లీ
ఎమ్మిగనూరు యువతరం విలేఖరి;
ఎమ్మిగనూరు లోని ఆర్ ఎ వీ ఎఫ్,ఆర్ వి పి ఎస్ రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలను బుధవారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు నాగన్న, కృష్ణ, నల్లారెడ్డి, ఖాజా, బతకన్న మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనీ కృష్ణ నదిపై సంగమేశ్వరం దగ్గర తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జికం బ్యారేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు.కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వలన రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, బాలు, రవి, రవీంద్ర, ఏసోబు, మణిరత్నం, వీరన్న తదితరులు పాల్గొన్నారు.