
రక్తదానం ప్రాణదానం చేస్తుంది
– డాక్టర్ సిహెచ్ ప్రదీప్‌కుమార్
కరీంనగర్ యువతరం ప్రతినిధి;
రక్తదానం ఆపద సమయంలో మరోకరికి ప్రాణదానం చేస్తుందని లైఫ్‌లైన్ హాస్పిటల్ చైర్మెన్, డాక్టర్ సిహెచ్ ప్రధీప్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని లైఫ్‌లైన్ హాస్పిటల్‌లో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ శిభిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా తన హాస్పిటల్ సిబ్బంది రక్తదాన చేయడం అభినందనీయమన్నారు. రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలిగిస్తు వారిని అవసర సమయాల్లో రక్తదానం చేసేలా ప్రోత్సాహించాలన్నారు. ఈ శిభిరంలో ప్రదీప్ కుమార్‌తోపాటు హాస్పిటల్ సిఈఓ డాక్టర్ కంచన్, డ్యూటీ డాక్టర్లు శ్రీకాంత్, రాజు, సిబ్భంది సాయికృష్ణ, ప్రణయ్, ముజీబ్, సాబీర్, వసీమ్, అనిల్, రమేష్, ఆనంద్, మహేందర్, వేణు, ఆరుణ్, తిరుమల్, అజయ్, శ్రీనివాస్ మరో 50 మంది రక్తదానం చేయగా హాస్పిటల్ నిర్వహకులు సిహెచ్ ప్రశాంత్‌కుమార్, చిట్టుమల్ల కొండయ్య పాల్గోన్నారు.