ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
జగనన్న సురక్ష సద్వినియోగం చేసుకోండి

జగనన్న సురక్ష సద్వినియోగం చేసుకోండి
తుగ్గలి యువతరం విలేఖరి;
మండలంలోని పెండేకల్, జొన్నగిరి సచివాలయాల్లో గురువారం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సావిత్రి తెలిపారు.బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించి 11 ద్రువీకరణ పత్రాలను ఉచితంగా తీసుకోవచ్చని ఆమె తెలిపారు. అలాగే ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు .అలాగే సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చూడాలని ఆమె కోరారు.