మంత్రి రోజా పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మంత్రి రోజా పర్యటన ఏర్పాట్లు పరిశీలన
నందికొట్కూరు యువతరం విలేఖరి;
నందికొట్కూరు పట్టణ మరియు పగిడ్యాల నందు శాప్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో రూ.2.38 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాల ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖ మంత్రి ఆర్.కె రోజా శనివారం నందికొట్కూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నందికొట్కూరు మరియు పగిడ్యాలలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి , పగిడ్యాల మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణ రెడ్డి , యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి , జూపాడుబంగ్లా మిడ్తూరు మండల నాయకులు శివనాగి రెడ్డి , కన్వీనర్ నాగార్జున రెడ్డి , నంద్యాల జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్ , కర్నూలు జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ , కో ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి , ముచ్చుమర్రి ఎస్సై, వార్డు కౌన్సిలర్ లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.