POLITICSTELANGANA

పోడు భూముల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి నియామకం

పోడు భూముల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి నియామకం

కామారెడ్డి యువతరం ప్రతినిధి;

కామారెడ్డి పోడు భూముల పరిరక్షణ కమిటీ మండల ప్రధాన కార్యదర్శిగా జరుపల గణేష్ నాయక్ ను నియామక పత్రము మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంగళవారం ఇవ్వడం జరిగింది.
మాచారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ పోడు భూముల పరిరక్షణ కమిటీ మండల ప్రధాన కార్యదర్శి జరపలా గణేష్ నాయక్ కి నియామక పత్రాలు ఇచ్చిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండలంలో సర్దాపూర్ తండాలో జరపలా గణేష్ నాయక్ వీరు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుండి కష్టపడి పని చేస్తున్నారన్నారు. వారికి ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో మండలంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల కోసం పార్టీ కోసం కాంగ్రెస్ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. మండలంలో బహుజనులకు, గిరిజనులకు, దళితులకు పోడు భూములు పట్టాలు కాంగ్రెస్ పార్టీ తరఫున పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని గ్రామంలో కార్యకర్తల వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అధిష్టానం ఇచ్చిన అవకాశం ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల పక్షాన నిలబడి మన గ్రామంలో అందరి కోసం మూడు ఎకరాల భూమి కోసం పోరాటం చేయాలని కలిసి సమస్యలు తెలియజేయడానికి కృషి చేయాలని షబ్బీర్ అలీ అన్నారు. నా పై నమ్మకంతో ఇచ్చిన పదవి కోసం నమ్మకంతో పని చేస్తానని సమస్యలను పరిష్కారానికి సమయం చేస్తానని తెలియజేసారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాష్, శ్రీనివాస్, మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ , ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నౌసిలాల్ నాయక్,
యూత్ అధ్యక్షుడు చేలపురం రాజిరెడ్డి,
పోడు భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ కొమరయ్య, సోషల్ మీడియా చైర్మన్ ఎర్రం గిరి, బాలయ్య, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్లేష్,
గ్రామ అధ్యక్షులు సంజీవ్, రాజు, శ్రీను, లకావత్, నాజం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!