ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
స్థానిక ఎన్నికలలో ఆర్యవైశ్యులకు అవకాశం ఇవ్వండి

స్థానిక ఎన్నికలలో ఆర్యవైశ్యులకు అవకాశం ఇవ్వండి
వెల్దుర్తి అక్టోబర్ 17 యువతరం న్యూస్:
స్థానిక ఎన్నికలలో వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు అవకాశం ఇవ్వాలని ఆర్యవైశ్యులు శుక్రవారం అమ్మవారి శాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీటీసీ మరియు సర్పంచ్ స్థానాలకు ఓసి రిజర్వ్ కావడం వలన తమకు ఒక అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ముఖ్యంగా వెల్దుర్తి పట్టణంలో పేరుకుపోయిన ట్రాఫిక్ సమస్య తోపాటు ఇతర సమస్యలను అందరినీ సమన్వయపరిచి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆర్యవైశ్యులకు అవకాశం ఇస్తే ముఖ్యంగా అవినీతి రహిత ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు తమకు ఒక అవకాశం ఇస్తారని వారు ఈ సందర్భంగా కోరారు.



