ANDHRA PRADESHDEVOTIONALWORLD

ప్రత్యేక అలంకరణలో వేపదారు శివలింగం

తొలి ఏకాదశి సంగమేశ్వరుని దర్శనభాగ్యం

ప్రత్యేక అలంకరణలో వేపదారు శివలింగం

పుణ్య స్నానాలతో మార్మోగిన క్షేత్రం

భక్తులకు దాతలు అన్నదాన కార్యక్రమం

కొత్తపల్లి జూలై 26 యువతరం న్యూస్:

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరంలోని గర్భాలయం నీట మునగకుండా తొలి ఏకాదశిన దర్శభాగ్యం లభించడంతో శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు వైభవంగా నిర్వహించారు.పశ్చిమ ద్వారం వద్ద గల నందీశ్వరుడు,లలితాదేవి, పంచశివలింగాలు, గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ముందుగా ప్రత్యేక అలంకరణలో అలంకరించి పూజలు నిర్వహించారు.ఆత్మకూరు డిపో సంగమేశ్వరానికి ఆర్టీసీ బస్సులు పెంచడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.సప్తనదుల్లో స్నానాలు ఆచరించి దేవతామూర్తులకు కాయ, కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంచనకంటే భక్తులు అధిర సంఖ్యలో తరలిరావడంతో వేపదారు శివలింగం స్పర్శదర్శనాన్ని రద్దు చేశారు.దాతలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి సంగమేశ్వరానికి కృష్ణానదిలో బోట్లు నిలిపివేయడంతో తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ఆటంకం ఏర్పడింది. అవతలి ఒడ్డు సోమశిల వరకు భక్తులు వచ్చి వెనుతిరిగారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!