ప్రాణ త్యాగం చేసైనా.. ప్రెస్ క్లబ్ ను కాపాడుకుంటాం
నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష

ప్రాణ త్యాగం చేసైనా..
ప్రెస్ క్లబ్ ను కాపాడుకుంటాం!
నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష
అనంతపురం ప్రతినిధి జూలై 15 యువతరం న్యూస్:
వందలాది మంది జర్నలిస్టుల జీవితాలతో ముడిపడి ఉన్న అనంతపురం ప్రెస్ క్లబ్ ను ప్రాణత్యాగం చేసైనా కాపాడుకుంటామని పలువురు దీక్షలో కూర్చున్న జర్నలిస్టులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్ష మంగళవారం మూడో రోజు కు చేరుకుంది. ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయ పార్టీలకు, జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ దీక్షలను చూసి ఎందరో ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం నుండి గాని, ఎన్నికల కోసమే గత ఆరునెలల కిందట ఏర్పాటైన తాత్కాలిక హడ్ హక్ కమిటీ సభ్యుల నుండి గాని దీక్షపరులకు ఎలాంటి స్పష్టమైన హామీలేని కారణంగా ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తున్నట్లు ప్రకటించారు. మూడవరోజు దీక్షలకు మద్దతు తెలిపిన వారిలో.. మద్దతు తెలిపిన వారిలో.. జై భీమ్ రామాంజనేయులు, సురేష్, ఎస్సీ జన సంఘం రాష్ట్ర నాయకుడు దాసగారిపల్లి కుల్లాయప్ప, ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు సాకే హరి, మాల మహానాడు అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు, సామాజిక కార్యకర్త డిస్కవర్ అనిల్ కుమార్ రెడ్డి, ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపకులు కేపీ రాజు, శంకర్ రెడ్డి, బేడ బుడగ జంగం రాష్ట్ర కార్యదర్శి సిరిశాల అంజి, గిరిజన నాయకులు బాబు నాయక్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పవన్ శ్రీధర్ రమణ, ఏఐఎస్ బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృద్వి, ఎస్సీ, ఎస్టీ ప్రజా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మళ్లీ, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి, ఇన్సాఫ్ అధ్యక్షుడు జాఫర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలియజేశారు.
– రేపటి నుంచే ఆమరణ నిరాహార దీక్ష
అనంతపురం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఏకైక కారణమైన ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో నేటి నుంచి (15-7-2026) ఆమరణ నిరాహార దీక్షలకు పోతున్నట్లు దీక్షలో కూర్చున్న పలువురు సీనియర్ జర్నలిస్టులు చెరుకూరి రామాంజనేయులు, రవి, రామ్మూర్తి, హరి, భాస్కర్ తదితరులు తమ స్పష్టమైన వైఖరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.



