ANDHRA PRADESHOFFICIAL

స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయ ఢంకా మోగించాలి

స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయ ఢంకా మోగించాలి

ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్

వెల్దుర్తి మే 30 యువతరం న్యూస్:

స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయ ఢంకా మోగించాలని ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వెల్దుర్తి మండలం లోని 10వ క్లస్టర్ అయిన గోవర్ధనగిరి గ్రామంలో జరిగిన మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట పత్తికొండ అబ్జర్వర్ పోలన్న పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాము అంతే ఉత్సాహంతో ఎన్నికలలో విజయాలు సాధించాలన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపిని నామరూపాలు లేకుండా ఓడించాలన్నారు. చంద్రబాబు నాయుడు మనపై ఉంచిన నమ్మకాన్ని మనము నిజం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పుల్లయ్య, మధుసూదన్ రెడ్డి, బాబు గౌడ్,శశి, రామచంద్రుడు,వెంకటరాముడు, శ్రీనివాసులు, చౌదరి, కృష్ణ, రాముడు, శేఖర్, రమేష్, రాజేష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!