ANDHRA PRADESHSPORTS NEWSSTATE NEWS

జిల్లాలోని పలు కేంద్రాల్లో విభిన్న క్రీడల్లో కోచింగ్

శిక్షణకు హాజరయ్యే వారికి డైట్, స్నాక్స్ సదుపాయం

మే నెలంతా విద్యార్థులకు స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపులు

8 నుంచి 16 ఏళ్ల విద్యార్థులకు ప్రత్యేక క్రీడా శిక్షణ

జిల్లాలోని పలు కేంద్రాల్లో విభిన్న క్రీడల్లో కోచింగ్

శిక్షణకు హాజరయ్యే వారికి డైట్, స్నాక్స్ సదుపాయం

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి మే 5 యువతరం న్యూస్:

జిల్లాలోని విద్యార్థులలో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు–2026 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 8 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమలోని ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని నంద్యాల స్పోర్ట్స్ కాంప్లెక్స్, రామకృష్ణ డిగ్రీ కళాశాల, టేక్కి మున్సిపల్ హైస్కూల్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, బాక్సింగ్, ఖో-ఖో, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కోచింగ్ నిర్వహిస్తారని చెప్పారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు చిక్కీ, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందించబడతాయని, ప్రతి క్రీడాకారుడికి డైట్ ఛార్జీలుగా రోజుకు రూ.10 ఇవ్వబడుతుందని తెలిపారు.

కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి కేంద్రానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నిధులను క్రీడా సామగ్రి కొనుగోలు, కోచ్‌ల గౌరవ వేతనాలు మరియు ఇతర ఖర్చులకు వినియోగించాల్సిందిగా సూచించారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సక్రమంగా సేకరించి ఆర్ టి జ  ఎస్ కు  అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ మరియు హాస్టల్ వార్డెన్లతో సమన్వయం చేసుకుని ఎక్కువ మంది విద్యార్థులు ఈ శిబిరాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన శిక్షణ అందేలా కోచ్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమం చివరలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ పోస్టర్‌ను విడుదల చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!