అలరించిన మన ఊరు మన జాతర గ్రామీణ క్రీడలు


అలరించిన మన ఊరు మన జాతర గ్రామీణ క్రీడలు
కోడుమూరు ఫిబ్రవరి 3 యువతరం న్యూస్:
కోడుమూరు పట్టణంలో సోమవారం నాడు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరుణాల సందర్భంగా ఏర్పాటుచేసిన మన ఊరు మన జాతర క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. సోమవారం నాడు వాలీబాల్ పోటీలు జిల్లాస్థాయి బాలురవిభాగము , మరియు వాలీబాల్ పోటీలు జిల్లా స్థాయి మహిళల విభాగము, గోన సంచి తో పరిగెత్తు పోటీలు, రుచి తిండి వీరుల పోటీలు, తప్పెట పోటీలు , చిన్నారులకు ముద్దుపాపల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు మంగళవారం నాడు బహుమతులు అందజేయనున్నట్టు క్రీడా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రత్యేకంగా యువత అధికంగా హాజరయ్యారు. భవిష్యత్తులో మరింత ఘనంగా చేస్తామని మన ఊరు మన జాతర సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సిఐ తబ్రీజ్ , ఎస్సైలు డివై స్వామి, రాజ్ కులయప్ప, లాయర్ ప్రభాకర్ ,రంగస్వామి, బలరాం , నాగేశ్వరరావు, గోవర్ధన్ ,బెస్తవీరన్న ,రాఘవేంద్ర తదితరులు తెలిపారు.



