ANDHRA PRADESHFILMWORLD
ఘనంగా నటుడు స్వర్గీయ శోభన్ బాబు జయంతి వేడుకలు


ఘనంగా నటుడు స్వర్గీయ శోభన్ బాబు జయంతి వేడుకలు
కర్నూలు ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
నటుడు స్వర్గీయ శోభన్ బాబు జయంతి సందర్భంగా కలెక్టరేట్ నందలి సునయన ఆడిటోరియంలో సంగీత విభావరి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్సీ అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంజనీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అనంతరం శోభన్ బాబు అభిమానులు శోభన్ బాబు సినిమా పాటలతో జయప్రదంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ని ఘనంగా సన్మానం చేశారు. అదేవిధంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.



