ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS

వృద్దురాలి హత్య కేసు ను చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

వృద్దురాలి హత్య కేసు ను చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు

ఒకరు అరెస్టు

రోకలి బండ, బంగారు ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్ లు స్వాధీనం

నిందితురాలి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

కర్నూలు క్రైమ్ సెప్టెంబర్ 09 యువతరం న్యూస్:

కర్నూలు లో ఈనెల 1 వ తేదీ జరిగిన కర్నూలు టౌన్ , గణేష్ నగర్ కు చెందిన కాటసాని శిలలీల (75) హత్య కేసును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్, కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్య, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిందితురాలి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇంట్లో పని మనిషి కురువ వరలక్ష్మి (49) హత్య చేసి శివలీల ఒంటి పై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.
మెయిన్ రోడ్డు లో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో 5 వేల సిసి కెమెరాలను ఇటీవల కాలంలో ఏర్పాటు చేశామన్నారు.
కర్నూలు పట్టణంలోనే 2 వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితురాలి వేలిముద్రలు ఘటన జరిగిన ప్రాంతంలో గుర్తించామన్నారు. శివలీలను రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసిందన్నారు. ముద్దాయి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు , బ్యాంకు పాసు పుస్తకాలు, చెక్ బుక్ లు, హత్య కు ఉపయోగించిన రొకలి బండను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ తో పాటు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్య, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కేసును త్వరితగతిన చేధించిన పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అభినందించిన రివార్డులు అందజేశారు.
హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, శేఖర్ బాబు, ప్రతాప్ కుమార్. కానిస్టేబుల్స్ నాగరాజు, చంద్రబాబునాయుడు, పరమేశ్వరుడు, సమీర్, రాముడు, వీరబాబు, హోంగార్డు ఇబ్రహీంలను జిల్లా ఎస్పీ అభినందించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!