ఘనంగా కాళోజి జయంతి

ఘనంగా కాళోజి జయంతి
ములుగు ప్రతినిధి సెప్టెంబర్ 9 యువతరం న్యూస్:
వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాలోజీ జయంతి ని ఘనంగా నిర్వహించారు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు,కార్యక్రమంలో కాలోజీ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తెలంగాణ మండలిక భాష కోసం చేసిన కృషిని తెలియజేశారు,కాలేజీ లాంటి మనస్తత్వం కలిసిన వ్యక్తులు అరుదుగా ఉంటారని ఆనందరావు అన్నారు,మరణంలో సైతం జీవించి ఉన్న వ్యక్తి కాళోజి నారాయణరావు అని అన్నారు,కాళోజి మరణించిన తర్వాత తన శరీరాన్ని వైద్య కళాశాలకు అందించిన ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు,అనంతరం మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాళోజి చేసిన సమాజసేవను గుర్తు చేశారు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాళోజి నారాయణరావు చేసిన పోరాటాన్ని విద్యార్థులకు వివరించారు, అప్పుడున్న సమైక్య పాలకులకు వ్యతిరేకంగా ఆయన రాసిన కవిత్వాన్ని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, మల్లయ్య, వెంకటరమణి ,ఆనంద్ శ్రీకాంత్, కుమార్ బాబు కంచు ప్రభాకర్, రాజేష్ షిండే, వస్య* తదితరులు పాల్గొన్నారు.



