ANDHRA PRADESHOFFICIALPROBLEMS
తాగునీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు


తాగునీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు
దేవనకొండ జులై 8 యువతరం న్యూస్:
దేవనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రక్కనే మంచినీరు ట్యాంకు ఉన్న పాఠశాలలో సౌకర్యం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన సమయంలో తాగునీరు లేకపోవడంతో గ్రామానికి సరాఫరా అవుతున్న తాగునీటి ట్యాంకు దగ్గరకు విద్యార్థులు నీరు తాగడానికి వచ్చారు. భోజనం చేసే చోటే తాగునీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.



