ANDHRA PRADESHDEVOTIONAL

వరుణదేవుడు కరుణించాలని పూజలు

వరుణదేవుడు కరుణించాలని పూజలు

24గంటల పాటు మంత్రభజన

118 నీటి బిందెలతో శంకరబండ గ్రామస్థులు ఊరేగింపుగా

ప్రత్యేక అలంకారంలో గాయత్రి దేవి

ఆస్పరి ఆగస్టు 8 యువతరం న్యూస్:

వరుణదేవుడు కరుణించాలని భక్తులు, రైతులు, గ్రామస్థులు వేదమాతగాయత్రీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రీదేవి నామస్మరణతో రామతీర్థం మారుమ్రోగింది. గురువారం ఉదయం మండల పరిధిలోని శంకరబండ గ్రామ సమీపంలో రామతీర్థం కొండ పై వెలసిన వేదమాత గాయత్రీదేవి ఆలయంలో గంగపూజ, కలశ స్థాపన, 24 గంటల పాటు గాయత్రీదేవి మంత్ర జపం, హోమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు రూప మోహన్ శర్మ మాట్లాడారు ప్రతి ఏడాది వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా గ్రామస్థులు, భక్తుల సహకారంతో ఆలయంలో విశేష పూజలు వ్రతాలు, 24 గంటల పాటు గాయాత్రీదేవి మంత్రజప భజన, హోమం, 118 బిందెలతో జలాభిషేకాలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం మహిళలు, యువకులు స్థానిక లింగమయ్య ఆలయం నుంచి మేళతాళాలతో పెద్దఎత్తున నీటి బిందెలతో తరలి వచ్చి అమ్మవారికి సమర్పించారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిసి పంటలు పండాలని భక్తులు నీటి బిందెలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పణ చేసి పూజలు చేశామని మహిళలు తెలిపారు.
విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ గాయత్రి కొండ ప్రాంతమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి విజయలక్ష్మి, గ్రామ పెద్దలు లక్ష్మీకాంతరెడ్డి, ముత్యాలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేంద్రరెడ్డి, రామచంద్రప్ప, మాదవకృష్ణ, గురప్ప నాగేంద్ర, రామంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!