దేశ భక్తిని ప్రతిబింబించేలా తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలి

దేశ భక్తిని ప్రతిబింబించేలా తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్ ఆగస్టు 08 యువతరం న్యూస్:
దేశ భక్తిని ప్రతిబింబించేలా తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
గురువారం తన క్యాంప్ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ప్రచార పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటి ఫై మువ్వన్నెల జండా) కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించడం జరుగుతోందన్నారు. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబించే విధంగా ఆగష్టు 15 వ తేదీ వరకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి భారతీయుడు తమ ఇళ్లలోకి జాతీయ జెండాను తీసుకువచ్చి గర్వంగా ఎగురవేసి వారి లో దేశ భక్తి పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో భాగంగా తిరంగా ప్రదర్శనలు, రంగోలి పోటీలు, తిరంగా రాఖి తయారీ, వర్కుషాప్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
బహిరంగ ప్రదేశాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమర యోధుల వారసులు, వివిధ రంగాల ప్రముఖుల ను ఆహ్వానించి తిరంగా ప్రదర్శనలు నిర్వహించాలని, ఈ ప్రదర్శనలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం చేస్తూ మువ్వన్నెల జండాల ప్రదర్శన, అమ్మకం నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ / బూత్ లను ఏర్పాటు చేసి, సెల్ఫీ ఫోటోలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హార్ఘర్థిరంగా .కం లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..దేశ భక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి గీతాల పోటీలు, నాటికలు ఏర్పాటు చేయాలని, తిరంగా బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ డా. కె వేణుగోపాల్, జడ్పీ సీఈఓ నాసర రెడ్డి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు పాల్గొన్నారు.



