కారంపూడిలో యమ్. ఎన్ హాస్పిటల్ ప్రారంభం

కారంపూడిలో
యమ్. ఎన్ హాస్పిటల్ ప్రారంభం
కారంపూడి జూన్ 07
యువతరం న్యూస్:
నిరుపేదలకు వైద్య సేవలు అందించటానికి యమ్. ఎన్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని వైద్యులు కె. శంతన్ అన్నారు.
శుక్రవారం మండల కేంద్రమైన కారంపూడి లోని డాక్టర్ వసంతరావు గారి హాస్పిటల్ పాత స్టేట్ బ్యాంకులో యమ్. ఎన్ హాస్పిటల్ ఏర్పాటు చేసి గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జరీ లు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొని రావటం జరిగిందని, అధునాతన వైద్యం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కారంపూడి లోనే వైద్యశాల ఏర్పాటు చేసామని డాక్టర్. కె. శంతన్ తెలిపారు. ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ వసంతరావు న్యాయవాదులు.చల్లా వెంకటేశ్వరరావు, భవనం నరసింహారెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ నాగేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…