ప్రముఖ కవి సాహితీవేత్త డాక్టర్ ఎన్. గోపి జయంతి సభలో

ప్రముఖకవి,సాహితీ వేత్త డాక్టర్ ఎన్.గోపి జయంతి సభలు
అమలాపురం యువతరం విలేఖరి;
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ,తెలుగు కవితా శిఖరం ప్రముఖకవి, పరిశోధకులు, విమర్శకుడు, అనువాదకుడు,నానీల సృష్టికర్త ,నిత్య చైతన్య కవితా మార్గ నిర్దేశకుడు డాక్టర్ ఎన్. గోపి జయంతి సందర్భంగా జూన్ 25, 26 , ఆది, సోమవారంరెండు రోజులపాటుఅమలాపురం సాయి సంజీవని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, కోనసీమ రచయితల సంఘం నానీలు వేదిక సంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు శ్రీ శ్రీ కళావేదిక కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు, నడక నానీల కవి, ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి శనివారం ప్రకటనలోతెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
జూన్ 26వ తేదీ సోమవారం డాక్టర్ గోపి సాహిత్యం పై ప్రసంగాలు జరుగుతాయని ఆయన చెప్పారు. డాక్టర్ గోపికి ఈరోజు హైదరాబాద్ కు ఒకరోజు ముందుగా ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు నల్లాచెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ కవులు బి.వి .వి.సత్యనారాయణ, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, విశ్రాంత భవిష్యనిధి అసిస్టెంట్ కమిషనర్ , న్యాయవాది అద్దంకిఅమరేశ్వరరావు , రవణ వేణుగోపాలరావు, కొప్పిశెట్టి నాగేశ్వరరావు,చాట్ల లక్ష్మీనారాయణ, మాకే బాలార్జున సత్యనారాయణ, చిట్టి మేను .వి. సూర్యనారాయణ సురేష్ న్యాయవాది పాల్గొంటారని ఆయన చెప్పారు.