యోగాతో ఆరోగ్యం, సేవా మార్గం
డాక్టర్ జి. ఉమాదేవి ప్రస్థానం


యువతరం దినపత్రిక ప్రత్యేక కథనం
యోగాతో ఆరోగ్యం, సేవా మార్గం
డాక్టర్ జి. ఉమాదేవి ప్రస్థానం
యోగా కేవలం వ్యాయామం కాదు, అది జీవన విధానం. శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం కూడా యోగా ద్వారా లభిస్తాయి. డాక్టర్ జి. ఉమాదేవి గారు గత ఐదేళ్లుగా ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందిస్తున్నారు, ఇప్పటివరకు కొన్ని వేల మందికి యోగా మరియు ప్రాణాయామా ద్వారా ఉపశమనం కలిగించారు మరియు శిక్షణ ఇచ్చారు. ఆమె తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి యోగాను వృత్తిగా ఎంచుకోవడం ద్వారా జీవితాన్ని సంతోషం గా మార్చుకోగలిగారు.
వ్యక్తిగత స్ఫూర్తి:
గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యతో బాధపడ్డారు, దీనివల్ల అలసట, నీరసం, చికాకు ఉండేవి. డాక్టర్లు జీవితకాలం మందులు వాడాలని చెప్పడంతో భయం, ఆందోళన కలిగాయి. టీవీలో డాక్టర్ మంతెన సత్యనారాయణ కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది, రోజు ఉదయం 4:30 గంటలకు యోగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.
తరువాత పెరుమాళ్ల దత్తయ్య గారి వద్ద మూడు సంవత్సరాలు యోగా నేర్చుకున్నారు, దీని ద్వారా తన థైరాయిడ్ సమస్యను గణనీయంగా తగ్గించుకోగలిగారు.
వృత్తి మార్పు:
కాలేజీ లెక్చరర్‌గా,ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నప్పటికీ, సొంతంగా యోగా ప్రాక్టీస్ కొనసాగించారు. కాలేజీలోని విద్యార్థులు, సహోద్యోగుల అనారోగ్య సమస్యలను చూసి, వారికి సేవ చేయాలనే తపనతో యోగాను ఒక వృత్తిగా ఎంచుకున్నారు. బెంగళూరులోని యస్-వ్యాస యూనివర్సిటీలో వై ఐ సి కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ, రోగులకు యోగా పట్ల ఆసక్తిని పెంపొందించి, వారి అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి సహాయం చేస్తున్నారు.
యోగా ప్రయోజనాలకు సాక్ష్యాలు :
చైతన్య: ఆరు నెలలుగా ఉమాదేవి వద్ద యోగా ప్రాక్టీస్ చేసి, పీసీఓడీ, నడుము నొప్పి, సయాటికా సమస్యల నుండి ఉపశమనం పొందింది.
శ్రీనివాస్: పాండిచ్చేరిలో చార్టర్డ్ అకౌంటెంట్. మూడు సంవత్సరాలుగా సయాటికా, మెడ నొప్పితో బాధపడ్డారు. డాక్టర్లు సర్జరీ చేయమని సలహా ఇచ్చినా, స్నేహితుల సిఫార్సుతో ఉమాదేవి ఆన్‌లైన్ క్లాసులలో చేరి ఉపశమనం పొందారు. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తండ్రి కూడా యోగా ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకున్నారు.
యోగా దినోత్సవం మరియు ప్రభుత్వ ప్రోత్సాహం:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ల ఆధ్వర్యంలో యోగాకు ప్రాచుర్యం, ప్రాధాన్యత పెరిగింది. గత సంవత్సరం అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు యోగా శిక్షణ శిబిరాల్లో, ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
ఈ సంవత్సరం ముఖ్యమంత్రి మంతెన సత్యనారాయణ ని యోగా, నేచురోపతి రంగాలకు ముఖ్య సలహాదారుగా నియమించడం సంతోషకరమైన విషయం.
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ “ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా” గా ప్రకటించబడింది. జూన్ 21న జరిగే ఈ వేడుకకు డాక్టర్ బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ముగింపు:
యోగా మన ఆరోగ్యానికి, మనసుకు, సమాజానికి ఒక శాశ్వత బలం. అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 మనకు ఈ బలాన్ని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరిని సాధనలో భాగస్వాములుగా ఆహ్వానిస్తోంది. యోగా ద్వారా తమ జీవితాల్లోని సమస్యలను దూరం చేసుకుని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“యోగా ఆరోగ్యానికి బాట”



