ANDHRA PRADESHPOLITICS

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా

డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా

పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మకు సూటి ప్రశ్న

వెల్దుర్తి జూన్ 6 యువతరం న్యూస్:

పత్తికొండ నియోజకవర్గం లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కర్నూలు జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు బృందం పత్తికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సవాల్ విసిరారు. జూన్ 4న వెన్నుపోటు దినం వైఎస్సార్సీపీ జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అంటూ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మను నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో మొఖం చూపించుకునేందుకు ఏదో ఒకటి సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వైయస్సార్సీపీ నాయకులు వస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. బాబాయ్ కి గొడ్డలిపోటు పొడిచింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. జూన్ 4 అంటే ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి విమోచన దినం అని తెలుగుదేశం నాయకులు గుర్తు చేశారు. రమ నాయకుడు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ శాంతికి మారుపేరు అని వైఎస్ఆర్సిపి నాయకులు ఎన్ని అరాచకాలు చేస్తున్నా తమ నాయకుడు మౌనంగా అన్ని భరిస్తున్నారన్నారు. భరిస్తున్నామంటే చేతగానితనం కాదని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాలలో గొడవలు సృష్టించడం మాజీ ఎమ్మెల్యేకు చెల్లుతుంది అన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్కు రాష్ట్రస్థాయిలో మంచి పేరు వస్తుంటే జీర్ణించుకోలేక గ్రామాలలో గొడవలను సృష్టించేందుకు మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తుందని వారు తెలిపారు. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓరువలేక పోతున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర బీసీ సాధికారక సమితి సభ్యులు, బోగోలు సర్పంచ్ అమర్నాథ్ గౌడ్, బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి, సుధాకర్ గౌడ్, రామకృష్ణ చారి, రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మహిధర్ రెడ్డి, కలుగొట్ల సర్పంచ్ మద్దిలేటి,బజారు, మనోహర్, రాముడు, చౌదరి, రాఘవేంద్ర, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!