OFFICIALSTATE NEWSTELANGANA

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి హిందీ ప్రపంచబుక్ ఆఫ్ రికార్డుల జాబితాలో చోటు

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి హిందీ ప్రపంచబుక్ ఆఫ్ రికార్డుల జాబితాలో చోటు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 27 యువతరం న్యూస్:

ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి హిందీ ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డుల జాబితాలో చోటు దక్కింది. ఈ ప్రపంచ రికార్డును కోదాడ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల చేతుల మీదుగా డాక్టర్ దివ్యమూర్తి అందుకోవడం జరిగింది. తదనంతరం సామినేని ప్రమీల డాక్టర్ దివ్యమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ దివ్యమూర్తి ప్రతిభను గుర్తించి ఈ సన్మానం చేసినట్లు సామినేని ప్రమీల తెలియజేశారు. ఈ ప్రపంచ రికార్డు రావడం ఈ రికార్డును సామినేని ప్రమీల చేతుల మీదుగా అందుకోవడం తనకు సంతోషంగా ఉందని డాక్టర్ దివ్య మూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 57 అవార్డులు వచ్చాయని 102 చోట్ల సన్మానం జరిగింది డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినీల, ముత్యాలు, మధు, డాక్టర్ దివ్యమూర్తి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!