ANDHRA PRADESHBREAKING NEWSEDUCATIONHEALTH NEWSSOCIAL SERVICE

21 నుంచి ఉచిత యోగ శిక్షణ

21 నుంచి ఉచిత యోగ శిక్షణ

మంగళగిరి ప్రతినిధి మార్చి 20 యువతరం న్యూస్:

మంగళగిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వారి దేవస్థానం ఆవరణలో శ్రీ రాధాకృష్ణా యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణా యోగి గురూజీ తెలిపారు. మూడు వారాలు పాటు జరిగే యోగ శిక్షణ శిబిరంలో యోగాసనములు, ప్రాణాయామం, ధ్యానంలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఋషులు, మునులు అందించిన యోగ సాధన ద్వారా మానసిక, శారీరక, బీపీ, షుగర్, గుండె దడ, భయాందోళన, నపుంసకత్వం, ఋతుక్రమ దోషాలతోపాటు 72 రకాల దీర్ఘ కాలిక వ్యాధులు మటుమాయమవుతాయన్నారు. ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురూజీ విజ్ఞప్తి చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!