ANDHRA PRADESHOFFICIALSOCIAL SERVICEWORLD

జ్ఞాన శక్తి,క్రియా శక్తి, ఇచ్చా శక్తి స్వరూపిణి మహిళ

జ్ఞాన శక్తి,క్రియా శక్తి, ఇచ్చా శక్తి స్వరూపిణి మహిళ

విద్యార్థులకు హైస్కూల్ స్థాయిలోనే మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పించాలి

సి కే హైస్కూల్ ఇంచార్జి ప్రిన్సిపల్ ఐవిఎస్ వరలక్ష్మి.

అనూషకు రోటరీ ఐకానిక్ డాక్టర్ అవార్డు బహుకరణ.

అనూష తో సహా 18 మందికి అవార్డుల అందజేత.

రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదరకూడదని మా తల్లిదండ్రులు నేర్పించారు.

డాక్టర్ అనూష కన్నీటి పర్యంతం:

పేదలకు మరిన్ని వైద్య సేవలను అందజేయాలన్నదే లక్ష్యం అని వ్యాఖ్య

మంగళగిరి ప్రతినిధి మార్చి 8 యువతరం న్యూస్:

ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి స్వరూపిణి మహిళ అని సికె హైస్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఐ వి ఎస్ వరలక్ష్మి అన్నారు. నాలుగు బాధ్యతలను నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు మహిళలోని నైపుణ్యం నాలుగు రెట్లు అధికమవుతుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గణపతి నగర్ లో ఉన్న ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యు పి హెచ్ సి వైద్యాధికారిని డాక్టర్ పి అనూషకు రోటరీ ఐకానిక్ డాక్టర్ అవార్డును బహుకరించారు.శాలువా కప్పి, మెమోంటోను అందజేసి డాక్టర్ అనూష ను ఘనంగా సన్మానించారు. వైద్యశాలలోని 17 మంది సిబ్బందికి షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులను అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివరంజని, డిస్ట్రిక్ట్ గ్రీటింగ్స్ చైర్మన్ అన్నే శివకుమారి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన వరలక్ష్మీ మాట్లాడుతూ, విద్యార్థులకు హై స్కూల్ స్థాయిలోనే మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. 1977 లో మార్చి 8వ తేదీని ఐక్యరాజ్యసమితి ప్రపంచ మహిళా దినోత్సవం గా ప్రకటించిందని తెలిపారు. అప్పటినుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. మహిళ లేకపోతే కుటుంబం, సమాజం ముందుకు సాగటం కష్టమని అన్నారు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే అని అన్నారు. నేటి సమాజంలో మహిళలపై పురుష ఆదిక్యం ఎక్కువైపోయిందని తెలిపారు. హక్కులు సాధించుకోవడానికి మహిళలందరం కలిసి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు డాక్టర్ పి అనూష జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు.

ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వు చెదరకూడదని తల్లిదండ్రులు నేర్పించారు

యు పి హెచ్ సి వైద్యాధికారిని డాక్టర్ పి అనూష తను జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను స్మరించుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకూడదని తన తల్లిదండ్రులు నేర్పించారని అన్నారు. జీవితం ఎప్పుడూ ఊహించిన విధంగా ఉండదు. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి అని అన్నారు. 2021 జూలై నెలలో స్కూటీపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు. తొలుత చిన్న గాయాలయినట్లు చెప్పారని తెలిపారు. నాలుగు రోజులు తర్వాత కుడికాలు కండరాలు చచ్చుబడిపోయాయని అన్నారు. ఐసీయూలో అడ్మిట్ చేసి ఐదు సర్జరీలు నిర్వహించారని స్పృహలోకి వచ్చాక కుడికాలు తీసేసినట్లు చెప్పారని ఒక్కసారిగా షాక్ కు లోనైనట్లు తెలిపారు. ఆ సమయంలో తనకు రక్తదాతలు 30 ప్యాకెట్ల ఏ నెగటివ్ బ్లడ్ అందించారని అన్నారు. కొత్త జీవితం ప్రారంభించాలని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ధైర్యం నింపారని అన్నారు. వారిచ్చిన ప్రోత్సాహం మేరకు వైద్యురాలిగా ఎంపికయ్యానని అన్నారు. 2022 మార్చి నెలలో ఇందిరానగర్ యూ పి హెచ్ సి లో వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టానని ఆ రోజున వైద్యశాల సిబ్బంది ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనని చెప్పారు. రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందించామని జాతీయ అవార్డు లభిస్తుందని తన తల్లి చెప్పారని పేర్కొన్నారు. శ్రమకు ప్రతిఫలంగా జూలై 2023లో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికెట్ లభించిందని అన్నారు. ఆ సమయంలో తన తల్లి తిరిగిరాని లోకాలకు చేరటం ఎంతగానో బాధించిందని అదే సమయంలో తన తండ్రి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ కన్నీటి పర్వంతమయ్యారు. కష్టాల్లో చిరునవ్వును కోల్పోకూడదని తల్లిదండ్రులు చెప్పిన మాటను స్మరించుకొని ముందడుగు వేశానని తెలిపారు. 30 మంది రక్తదానం చేస్తే తనకు పునర్జన్మ లభించిందని గుర్తు చేసుకుంటూ తను కూడా అనేకసార్లు రక్తదానం చేశానని చెప్పారు. జీవితకాలంలో 60 మందికి రక్తదానం చేయాలని సంకల్పంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.గుంటూరు నుండి విధుల నిమిత్తం మంగళగిరి కి వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండాలని కారు డ్రైవ్ చేయడం నేర్చుకోవాలని ఆలోచన వచ్చిందని చెప్పారు. ప్రయత్నిస్తే సాధ్యపడనిది ఏదీ ఉండదని తన తండ్రి మనోధైర్యాన్ని నింపారని అన్నారు. ఈ నేపథ్యంలో ఎడమ కాలు తోనే యాక్సెంటెటర్, బ్రేక్ ను మేనేజ్ చేస్తూ, డ్రైవింగ్ నేర్చుకున్నానని పేర్కొన్నారు. ప్రతిరోజు కారు నడుపుకుంటూ మంగళగిరి వచ్చి తిరిగి గుంటూరు నివాసానికి వెళుతున్నానని చెప్పారు. రెండు కాళ్లు, చేతులు లేని వాళ్ళు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించటం చూస్తే తనలో ధైర్యం విశ్వాసం పెరిగిందని తెలిపారు. కష్టాలను తలచుకొని భయపడకూడదని ధైర్యంగా ఎదుర్కొంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని ఆత్మసంతృప్తి ప్రధానమని అన్నారు. వైద్యం కోసం తన వద్దకు వచ్చే రోగులు చికిత్స అనంతరం వ్యాధి నయమైందని చెప్పిన తరువాత తనకు కలిగే ఆనందం ఎన్ని లక్షలు చెల్లించిన రాదని తెలిపారు.

ఆమె జీవితం స్ఫూర్తిదాయకం: గాజుల శ్రీనివాసరావు

డాక్టర్ అనూష జీవితం స్ఫూర్తిదాయకమని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అన్నారు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగు రాలిగా మారినప్పటికీ, ఆ తరువాత తన తల్లి మృతి చెందినప్పటికీ, తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పటికీ వీటిని ఎదుర్కొంటూ జాతీయస్థాయిలో అవార్డు సాధించటం రోగుల చేత మా డాక్టరమ్మ అని పిలిపించుకోవడం సాధారణమైన విషయం కాదని అన్నారు. ఆమెను సన్మానించుకోవటాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గర్వంగా భావిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, రోటరీ ఛార్టర్డ్ ప్రెసిడెంట్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, ప్రాజెక్టు చైర్మన్ త్రిపుర మల్లు సతీష్, వైస్ చైర్మన్ నిరంజన్ గుప్తా, ఇసునూరు అనిల్ చక్రవర్తి,రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్లు కెవిఎస్ ప్రకాశరావు, అంది రేవంత్ కుమార్ ,గోపాలరావు, ఆళ్ల సురేష్ బాబు, నూతలపాటి వెంకటేశ్వరరావు, కాపరౌతు సుందరయ్య, తులిమిల్లి రామకృష్ణ, అన్నె చంద్రశేఖర రావు, బట్టు నారాయణరావు, బట్టు వెంకటేశ్వరరావు, గుంటి నాగరాజు, మయా కుంట క్రాంతి కుమార్ డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అవార్డు గ్రహీతలు వీరే:

డాక్టర్ అనూష తో సహా 18 మంది వైద్య సిబ్బందిని శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.. ఏఎన్ఎం లు ఏ జ్యోతి, ఏం సుజాత, ఎం కవిత, బి ఝాన్సీ, రాణి, విజయ కుమారి, వి విజయలక్ష్మి, ఆశా వర్కర్లు ఎస్.కె రెహనా, షేక్ నజీమా, పి కుమారి, ఎస్ భాగ్యలక్ష్మి, ఏ శ్రావణి, ఏ తిరుపతమ్మ, లక్ష్మీకాంతం, ల్యాబ్ టెక్నీషియన్ ఎస్.కె దిల్షా, స్టాఫ్ నర్సు లు కే నాగజ్యోతి, జి వరలక్ష్మి, శానిటేషన్ వర్కర్ టి శాంతి లను వారి ఫోటోలతో కూడిన మెమొటోలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి అనూష సిబ్బంది మాట్లాడుతూ వైద్యశాల ప్రారంభం నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తమకెంతో చేయూతనిస్తోందని సుమారు మూడు లక్షల రూపాయల విలువైన వైద్య సామాగ్రిని ఇప్పటికే అందజేశారని తెలిపారు. మహిళా దినోత్సవం నాడు తమను సన్మానించడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందని ఇందుకు రోటరీ క్లబ్ మంగళగిరి ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!