ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ లక్ష్మీ ఘన మద్దిలేటి నరసింహస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీ లక్ష్మీ ఘన మద్దిలేటి నరసింహస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ
దేవస్థానం ఈవో
బేతంచెర్ల ప్రతినిధి ఫిబ్రవరి 23 యువతరం న్యూస్:
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపాన వెలసిన శ్రీ లక్ష్మి గణ మద్దిలేటి నరసింహస్వామి వారి దేవస్థానంలో
మాఘ మాస స్థిరవాసరాన్ని పురస్కరించుకొని ఉరుకుంద ఈరన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఈవో మరియు వేద పండితులు అర్చక పరివారము మరియు ఇతర సిబ్బంది అందరూ విచ్చేసి శ్రీమద్దిలేటి నరసింహస్వామివారికి వారము చేసుకోవడం జరిగినది. ఇందులో భాగంగా భాజా భజంత్రీలు నడుమ ఊరేగింపు మరియు స్వామి అమ్మవార్లకు ఇరువురికి పట్టు వస్త్ర సమర్పణ చేసి శ్రీ మద్దిలేటి నరసింహస్వామి వారికి నీరాజనం మంత్రపుష్పములు సమర్పించడం జరిగినది ఇందులో మద్దిలేటి నరసింహస్వామి వారి కార్యనిర్వహణాధికారి మరియు ఉప కమీషనర్ ఏర్పాట్లు చేశారు.