ANDHRA PRADESHOFFICIAL
ఈనెల 25న ఇంటర్వ్యూలు

ఈనెల 25న ఇంటర్వ్యూలు
వెల్దుర్తి ఫిబ్రవరి 23 యువతరం న్యూస్:
మండలంలో బీసీ, ఈ బీసీ, కాపు కులములకు చెందిన లబ్ధిదారులకు బ్యాంకు అనుసంధానంతో సబ్సిడీ కూడిన రుణములకు సంబంధించి గత నెల 8వ తారీకు నుండి ఈనెల 15 తారీకు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 25 మంగళవారం మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుహాసినమ్మ శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి రావాలని ఎంపీడీవో తెలిపారు. వెల్దుర్తి, రామళ్లకోట, గోవర్ధనగిరి,కలగొట్ల గ్రామాలకు చెందిన బ్యాంకర్లు హాజరవుతారన్నారు.