సిఐ సుబ్బారావుని సన్మానించిన టిడిపి నాయకులు

జిల్లా ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీత యర్రగొండపాలెం సీఐ CH ప్రభాకర్ రావు ని సన్మానించిన టీడీపీ నాయకులు
గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు పురస్కారాన్ని అందుకున్న యర్రగొండపాలెం సర్కిల్ సీఐ CH ప్రభాకర్ రావు ని టీడీపీ నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో సీఐ ప్రభాకర్ రావు సేవలను కొనియాడారు. నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అమలు పరచడంలో, కేసుల పరిష్కారంలో త్వరగతిన చొరవ చూపినందుకు జిల్లా యంత్రాంగం గుర్తించి ఉత్తమ పురస్కారం అందించినందుకు, నియోజకవర్గానికి పేరు తీసుకువచ్చినందుకు టీడీపీ నాయకులు సీఐ ప్రభాకర్ రావు ని అభినందించారు. ఇలాగే తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు , పయ్యావుల ప్రసాద్ రావు, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) , టీడీపీ నాయకులు మంత్రు నాయక్ , సత్యనారాయణ గౌడ్ , రెంటపల్లి సుబ్బారెడ్డి , వెంకట్రావు గౌడ్ , నక్కా రాములు , కిషోర్ సింగ్ , శనగా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.