వెల్దుర్తి ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 427 మరియు 428 యదేచ్ఛగా కబ్జా
తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఆక్రమణలు

దర్జాగా ప్రభుత్వ స్థలాలు కబ్జా
ప్రభుత్వ స్థలం ఉందా కబ్జా చేసేయ్
వెల్దుర్తి జనవరి 27 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా, గెస్ట్ హౌస్ వెనుకన సర్వేనెంబర్ 247 మరియు సర్వేనెంబర్ 248లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. తక్షణమే అక్రమార్కులు ప్రభుత్వ స్థలంలో యదేచ్చగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కూత వేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారు అన్నది ప్రశ్న. గతంలో అక్రమ నిర్మాణాలపై కొద్దిమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ తూతూ మంత్రంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. కొద్దిమంది అక్రమార్కులు నకిలీ పట్టాలు తెచ్చుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో వెల్దుర్తిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలు లేక ప్రైవేటు గదులలో కార్యకలాపాలు సాగిస్తూ వేల రూపాయలను సమర్పించుకుంటున్నారు. మరి ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల నుండి స్వాధీనం చేసుకుంటే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ నిర్మించవచ్చని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.