నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తనతో మెలగాలి

నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తన తో మెలగాలి
రౌడీ షీటర్లు భూ దందాలు, సెటిల్మెంట్లు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం
రౌడీ షీటర్ లో ఆయా గ్రామాలలో రౌడీయిజానికి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
పిడియాక్ట్ లు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది
మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
మంగళగిరి ప్రతినిధి జనవరి 26 యువతరం న్యూస్:
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి గొడవలకు, భూదందాలకు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, దౌర్జన్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, గ్రామీణ ప్రాంతాలలో విద్వేషాలు సృష్టించకుండా ఉండాలని, అన్ని వివాదాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. అలా కాకుండా గొడవలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే పిడి యాక్ట్లు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన రౌడీ షీటర్లను హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా రౌడీషీటర్లు, రౌడీయిజానికి పాల్పడినట్లయితే గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.