ANDHRA PRADESHEDUCATION
1989-1990 సంస్థలకు పదవ తరగతి పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

1989-1990 సంవత్సరపు పదవ తరగతి పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
వెల్దుర్తి డిసెంబర్ 30 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి 1989-1990 సంవత్సరానికి గాను పదవ తరగతి పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనాడు విద్యా బోధనలు అందించిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.