సమాచార హక్కు ప్రతి పౌరుడి హక్కు

సమాచార హక్కు ప్రతీ పౌరుడి హక్కు
హైదరాబాద్ బ్యూరో సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
ప్రజలే యజమానులుగా ప్రజలకు జవాబుదారీ తనంగా వహించాలి అని ప్రజాధికారులకు గుర్తు చేస్తూ ప్రతీ సామాన్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఏర్పాటయి చట్ట సభల్లో ఆమోదం పొందిన చట్టమే సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం 2005 అనేది అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతగా భావించే చట్టం మాత్రమే కాదు ప్రశ్నించే ప్రతి పౌరుని హక్కు ఈ చట్టాన్ని సక్రమంగా అమలు జరగడానికి మరియు పౌర సమాచార అధికారుల నిర్లక్ష్యానికి వారికీ శిక్షలు, జరిమానాలను విధించే విదంగా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టానికి అనుబంధంగా కొన్ని చట్టాలు సెక్షన్లు అమలయ్యే విధంగా ఇతర చట్టాలు కూడా ఉన్నాయి.వీటన్నింటిని మా యొక్క సంస్థ ద్వారా ప్రజలకు, యువతకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సుల ద్వారా ఆలోచింపజేసే విధంగా ప్రశ్నించే విధంగా ఇది మా హక్కు అని గ్రహించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
చంటి ముదిరాజ్
జాతీయ ప్రధాన కార్యదర్శి
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ
సెల్: ±91 7801001004