ఘనంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు
కొత్తపల్లి సెప్టెంబర్ 20 యువతరం న్యూస్:
సీనియర్ రాజకీయ నాయకులు, రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కొత్తపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాజీ సింగల్ విండో చైర్మన్ బోరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు నాగ శేషులు యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేక గుర్తింపు పొంది, రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కొత్తపల్లి లో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పుల్లయ్య గౌడ్, గంగన్న, వెంకటేశ్వర్లు పక్కిరెడ్డి శ్రీనివాసు నాయక్ తిక్క స్వామి శివశంకర్ రామకృష్ణ జయ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు .