సామాజిక చైతన్యం బోయి భీమన్న కవిత్వానికి ప్రాణం

సామాజిక చైతన్యం బోయి భీమన్న కవిత్వానికి ప్రాణం
…. నాని రాజు
అమలాపురం ప్రతినిధి సెప్టెంబర్ 19 యువతరం న్యూస్:
సామాజిక చైతన్యం మహాకవి బోయి భీమన్న కవిత్వానికి ప్రాణమని శ్రీ శ్రీ కళావేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం లోని కూచిమంచి వారి అగ్రహారంలోని లోని సాయి సంజీవిని ఆసుపత్రి ఆడిటోరియంలో గురువారం ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో
మహాకవి బోయి భీమన్న జయంతి సభ జరిగింది . సభకు నానిరాజు అధ్యక్షత వహించి ప్రసంగించారు.
శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్ నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ కోనసీమలోని మామిడికుదురు గ్రామంలో జన్మించి మహాకవిగా ఎదిగి కళా ప్రపూర్ణ, పద్మశ్రీ, వంటి ఎన్నో బిరుదులు, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు,సాధించి తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలోనూ 70 గ్రంథాలకు పైగా రచించిన బోయి భీమన్న తెలుగు సాహిత్యంలో వెలుగు శిఖరం అని అన్నారు.నేను సూర్యుని కాదు చంద్రుణ్ణి నాకున్నది ఎండ కాదు గుండె అంటూ భీమన్న శాంతి విప్లవాన్ని ప్రకటించారని ఆయన అన్నారు. ఆయన రచించిన పాలేరు నాటక స్ఫూర్తితో ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు పొంది చైతన్యవంతులయ్యారని ఆయన అన్నారు. ఆయన రచించిన ఆత్మకథ పాలేరు నుండి పద్మశ్రీ వరకు చదివితే ఆయన కవిత్వతత్వం తెలుస్తుందని అన్నారు.
కళావేదిక జిల్లా కన్వీనర్ ప్రముఖ కవి బి వి వి సత్యనారాయణ మాట్లాడుతూ 1975లో భీమన్న సామాజిక చైతన్యంతో రచించిన గుడిసెలు కాలిపోతున్నాయి రచనకుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని ఆయన అన్నారు నాని రాజు, డాక్టర్ నల్లా నరసింహమూర్తి, బి వి.వి సత్యనారాయణ
మహాకవి బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాకవి భీమన్న సాహిత్యం పై విద్యార్థులకు నిర్వహించిన కవితల పోటీలలో విజేతలైన విద్యార్థులకు నాని రాజు బహుమతులు అందజేశారు.” కవితా శిఖరం బోయిభీమన్న “కవితను నరసింహమూర్తి సభలో చదివారు.
కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాకే బాలా ర్జున సత్యనారాయణ, కడలి సత్యనారాయణ ,
పాల్గొన్నారు.