సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు సబ్సిడీ పథకాలను సద్వినియోగించు కోవాలి
పాములపాడు ఆగష్టు 28 యువతరం న్యూస్:
ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న
సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగించుకోవాలని ఆత్మకూరు ఉద్యాన అధికారి చందన అన్నారు.మంగళవారం
మండలంలోని భానుముక్కల గ్రామంలో ఉద్యాన శాఖ అధికారిని కే చందన మిరప పంటలో ఈ క్రాప్ బుకింగ్ ను పరిశీలించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటలను ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలకు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి అని తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటలకు, కూరగాయలకు, పూల తోటలకు వివిధ రకాల సబ్సిడీలు ఉన్నాయని వాటిని రైతులు తప్పనిసరిగా సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. తైవాన్ స్ప్రేయర్లు మినీ ట్రాక్టర్లు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవలెను. డ్రిప్పు స్ప్రింక్లర్లు కావలసిన రైతులు కూడా సంబంధిత రైతు సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవలెను. ఈ కార్యక్రమంలో భానుముక్కల ఎంపిఈఓ ముర్తుజావలి, బానకచర్ల వి ఏ ఏ ఇలియాస్ మరియు రైతులు పాల్గొన్నారు.