పెండింగ్ వేతనాలు చెల్లించాలి

స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలి
కొత్తపల్లి ఆగస్టు 28 యువతరం న్యూస్:
స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాల ను15వ ఆర్థిక సంఘం నిధుల నుండి చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛభారత్ గ్రామీణ పారిశుద్ధ కార్మికుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు స్వాములు హనుమంతు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కొత్తపల్లి ఎంపీడీవో కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్మికులకు 12 నుండి 18 నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు రాక పారిశుద్ధ కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తుంటే గ్రామపంచాయతీ సర్పంచులు నిధులు మంజూరైన ప్రతిసారి కార్మికులకు వేతనాలు చెల్లించకుండా తమ పనులకు బిల్లులు చేసుకుంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సర్కులర్ జారీ చేసినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు వాటిని పక్కన పెడుతున్నారు. ఇప్పటికైనా స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మొత్తం వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి చెల్లించాలని లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఓబుల్ రాజు వెంకటేశ్వర్లు త్యాగరాజు రత్నమయ్య శ్రీరాములు చెన్నయ్య రవి పాల్గొన్నారు.