వీధిలైట్లు ఏర్పాటు చేయండి

వీరాపురం గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలి
ఏఐఎస్ఎ
వీధి లైట్లు లేక…అంధకారంలో కొత్త ఎస్సి కాలనీ వాసులు
కొత్తపల్లి ఆగస్టు 28 యువతరం న్యూస్ :
కొత్తపల్లి మండలంలోని వీరాపురం గ్రామంలో పాత,కొత్త ఎస్సి కాలనీ లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని అలాగే ఉన్న వీధి లైట్లు వెలగడం లేదని ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గువ్వలకుంట్ల సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి 2 నాగార్జున గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా నాయకులు వర్ధన్,జాన్సన్ బాబు మాట్లాడుతూ…జీ.వీరాపురం గ్రామంలో చాలా వరకు వీధి లైట్లు వెలగకపోవడం వల్ల పాత, కొత్త ఎస్సి కాలనిలో వీధి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే తీవ్ర భయాందోళ చెందుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో విషపురుగుల సంచారం అధికంగా ఉంటుంది రాత్రి పూట ఇళ్లలోనుంచి బయటకు రాలేకపోతున్నారని. ఎవరికి ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండంతో పాటు, పగ లు ఎండి వేడిమి కూడా అధికంగా ఉండడంతో విషపురుగులు ఎక్కువ గా వస్తున్నాయి ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచ్ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీరాపురం గ్రామం ఎస్సి పాత,కొత్త,కాలనిలో వీధి లైట్ల సమస్య పరిష్కరించాలని లేకపోతే గ్రామ ప్రజలను కలుపుకుని ఆందోళనలు చేస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ గా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.